కేరళ కోజికోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను పౌర విమానయాన శాఖకు సమర్పించారు అధికారులు. విమానం ప్రమాదానికి గురవ్వడానికి ముందు ల్యాండింగ్‌కు క్లియరెన్స్ పొందినట్లు తెలిపారు.
ల్యాండింగ్‌కు క్లియరెన్స్ వచ్చాకే కూలిన విమానం! - Kerala plane crash preliminary report
కేరళ కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి ముందు ల్యాండింగ్‌కు క్లియరెన్స్ పొందినట్లు తెలుస్తోంది.
![ల్యాండింగ్‌కు క్లియరెన్స్ వచ్చాకే కూలిన విమానం! Kerala plane crash: After getting landing clearance, aircraft went out of runway, says preliminary report](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8351838-579-8351838-1596954594018.jpg)
నివేదిక ప్రకారం.. మొదట విమానం ల్యాండ్ అవ్వడానికి కంట్రోలర్ క్లియరెన్స్ ఇచ్చింది. 2వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విజిబిలిటీ, ఉపరితల పరిస్థితులు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పైలట్‌కు సూచించింది. భారీ వర్షం పడుతున్నందు వల్లే విమానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పైలట్ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మొదటిసారి ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడిన తర్వాత విమానాన్ని 10 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాలని పైలట్‌కు కంట్రోలర్ సూచించింది. 7 వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక... కిందకు వచ్చేందుకు అనుమతించాలని పైలట్ కంట్రోలర్‌ను కోరారు. 3 వేల 600 అడుగుల ఎత్తు తగ్గించుకున్న తర్వాత ల్యాండింగ్‌కు మరోసారి క్లియరెన్స్ ఇచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం సరిగ్గా ల్యాండ్ కాలేకపోయింది. రన్‌వేను బలంగా ఢీకొన్న వెంటనే పక్కకు జారిపోయింది. రన్‌వేపై విమానం కనిపించకుండా పోయిన వెంటనే ఫైర్ బెల్, అలారంను యాక్టివేట్ చేసింది కంట్రోలర్.