తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔరా! ఆ ఉపాధ్యాయుని చేతులు అద్భుతాలను చేశాయి - ఔరా! ఆ ఉపాధ్యాయుని చేతులు అద్భుతాల్ని చేశాయి

వాడిపారేసిన వ్యర్థాలను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతూ గుర్తింపు తెచ్చుకున్నారు ఓ ఉపాధ్యాయుడు. ఇలా చేయడం ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చనే చక్కటి సందేశాన్నిస్తూ.. ఏకంగా తన ఇంటినే ఓ ప్రయోగశాలగా మార్చేశారు నజీమ్​ కె.సుల్తాన్​. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆయన ఆలోచనలు.. కేరళలోని తన ఇంటిని మ్యూజియంగా మార్చాయి.

Kerala Physics teacher sets an example by recycling and reusing waste
ఔరా! ఆ ఉపాధ్యాయుని చేతులు అద్భుతాల్ని చేశాయి

By

Published : Oct 16, 2020, 10:41 AM IST

ఔరా! ఆ ఉపాధ్యాయుని చేతులు అద్భుతాల్ని చేశాయి

ఓ ఉపాధ్యాయుడు తన ఇంటిని అందమైన మ్యూజియంగా మార్చారు. అదేదో అందరిలా పురాతన వస్తువులు సేకరించి కాదు.. వాడి పారేసిన వస్తువులను రీసైక్లింగ్​ చేసి. ఇలా అనేక వ్యర్థాలను పునరుత్పాదించి ఏకంగా తన ఇంటినే ఓ ప్రయోగశాలగా రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనశాల కేరళలో ఉండగా.. దానికి ఆద్యుడు కొల్లం జిల్లాలోని కొట్టాయంకు చెందిన సైన్స్​ టీచర్​ నజీమ్​ కె.సుల్తాన్​.

ప్రత్యేక ఆకర్షణగా..

భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడైన నజీమ్​.. ఎంతో అపురూపంగా ఈ ప్రయోగశాలను అలంకరించారు. బయటినుంచి చూడగానే.. అద్భుతమైన అనుభూతిని కలిగించేలా ఉంటుంది ఆయన గృహం. చిన్న ప్రదేశంలోనే పెద్ద తోటను ఏర్పాటు చేశారు. అక్కడ పాత హెల్మెట్​లు, ప్లాస్టిక్​ బాటిళ్లు, క్యాన్​లు పూలకుండీలుగా ఉంటాయి. వాడుకలో లేని సైకిల్​పై గుబురు చెట్లు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇలా వేటికవే ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. కొవిడ్​ను ప్రతిబింబించేలా ప్లాస్టిక్​ సీసాలతో తయారైన కరోనా వైరస్​ నమూనా ఆ అందాలకు మరింత సొబగునందిస్తోంది.

సుల్తాన్​ రూపొందించిన ఆకర్షణీయమైన వెదురు స్విచ్​ బోర్డులు చూపరులను కట్టిపడేస్తాయి. కిటికీకి అమర్చిన కృత్రిమ వర్షమాపని.. దానికి కింది భాగంలోనే అమర్చిన అక్వేరియం ఈ ప్రదేశానికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి.

'వెల్లుల్లి' పుష్పం..

ఏ వస్తువునూ వ్యర్థం చేయరాదనే పట్టుదలతో.. వెల్లుల్లి తొక్కలతో అందమైన పువ్వులను తయారు చేశారీ ఉపాధ్యాయుడు. పాత పీవీసీ పైపులు, పనికిరాని ఎలక్ట్రిక్​ పరికరాల సాయంతో సంగీత వాయిద్యాలనూ రూపొందించారు. అంతేకాకుండా.. పాములను పట్టుకోవడానికి ఇటీవలే ఓ ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారీ టీచర్​. అయితే.. దానికి పేటెంట్ హక్కులు రావాల్సి ఉంది.

పాఠశాల స్థాయి నుంచే..

విద్యార్థి స్థాయి నుంచే సైన్స్​ ఫెయిర్​లలో పాల్గొనడం వల్ల.. వ్యర్థ పదార్థాలను రీసైకిల్​ చేయడంపై అవగాహన కల్పించుకున్నారు నజీమ్​. అలా సైన్స్​పై మక్కువతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా రాణిస్తున్నారు. తన నైపుణ్యంతో అనేక బోధనోపకరణాలను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు సుల్తాన్​​. స్మార్ట్​ తరగతి గదుల రూపకల్పన వంటి సైన్స్​ ప్రాధాన్య కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహకారమందిస్తున్నారు.

వ్యర్థ పదార్థాలను ఆసక్తికరమైన, అందమైన కళాఖండాలుగా మార్చవచ్చని నిరూపించారీ ఉపాధ్యాయుడు. ఇలా వస్తువులను రీసైక్లింగ్​​ చేయడం ద్వారా డబ్బును ఆదా చేస్తూనే.. ఇంటిని అలంకరించుకోవచ్చని నజీమ్ సుల్తాన్​ రుజువు చేశారు.​

ఇదీ చదవండి:ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

ABOUT THE AUTHOR

...view details