తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 8:45 PM IST

ETV Bharat / bharat

పేదల పాలిట దేవుడు.. వారంలో ఆరురోజలు ఉచిత భోజనం!

ఉండటానికి ఇళ్లు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేని పేదవారికి అండదండగా నిలుస్తున్నాడు కేరళకు చెందిన ఓ యువకుడు. ఫుట్​పాత్​లే ఆసరాగా బతికేవారికి వారంలో ఆరురోజుల పాటు ఉచిత భోజనం అందిస్తున్నాడు. అది కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.. మరి అతని కథేంటో చూసేద్దామా...!

పేదల పాలిట దేవుడు.. వారంలో ఆరురోజలు ఉచిత భోజనం!

పేదల పాలిట దేవుడు.. వారంలో ఆరురోజలు ఉచిత భోజనం!
కేరళ త్రిస్సూర్​లో ఓ వ్యక్తి వారానికి ఆరు రోజులు పేదలకు ఉచితంగా భోజనం పెట్టి రోజుకు సుమారు 150 మంది ఆకలి తీరుస్తున్నాడు.

ఆకలి బాధలు వద్దు

ఇళ్లు-వాకిలి లేక రోడ్లపై పడి ఆకలికి అలమటించేవారు ఎందరో.. అలాంటి వారిని చూసి కొందరు జాలి పడితే.. మరికొందరు చీదరించుకుంటారు. కానీ వారి ఆకలి తీర్చే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటివారిలో అగ్రవరుసలో ఉంటాడు మదర్​ జనసేవా చారిటబుల్​ ట్రస్ట్​ ఛైర్మన్​ జేసన్​ పాల్.

ఓ మనిషికి ఎన్నో బాధలు ఉంటాయి. కానీ, ఆకలి బాధ ఉండకూడదంటాడు పాల్​. అందుకే తనకు తోచినంతలో పదిమందికి అన్నం పెట్టాలనుకున్నాడు. ఎలాగైనా ఉచిత భోజన క్యాంపుకు శ్రీకారం చుట్టాలని సంకల్పించాడు.

ఇప్పుడు పట్టలం రోడ్​లో మధ్యాన్నం 12 అయ్యిందంటే చాలు.. భోజనం డబ్బాలతో సిద్ధంగా ఉంటాడు పాల్​. ఏదో దానం చేసినట్టు కాదు, వారానికి ఆరు రోజులు పేదలకు మర్యాద పూర్వకంగా భోజనం వడ్డిస్తాడు. ఇలా రోజూ 100 నుంచి 150 మంది కడుపు నింపుతున్నాడు.

ఒక్కరి కడుపు నింపు...

'వంద మందికి కాకపోయిన.. కనీసం ఒక్కరి కడుపు నింపు' అనే నినాదంతో ఆయన ఈ గొప్ప క్యాంప్​ బాధ్యతలు తీసుకున్నాడు. పాల్​ భార్య బినూ మారియా, ఓ బస్సు డ్రైవరు షైన్​ జేమ్స్​ , ఓ​ దుకాణంలో కార్మికుడైన ఇస్మాయిల్.. ​ ఆటో డ్రైవర్​ శ్రీజిత్, స్కూల్​ టీచర్​ రమ్య సాయంతో పేదలకు పాల్ ఉచిత భోజనం అందిస్తున్నాడు.

వీరంతా 7.30 నిమిషాలకు వంట ప్రారంభిస్తారు. ఇందకు వారికి రోజుకు 5 వేల దాకా ఖర్చవుతోంది. పాల్​ ఓ పండ్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు​.

శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న మన దేశంలో పేదరికం తగ్గింది... కానీ ఆకలి బాధలు పెరుగుతున్నాయని ఇటీవలి సర్వేలు స్పష్టం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాల్​ ఇలాంటి ఆలోచన చేయడం నిజంగా ప్రశంసనీయం అంటున్నారు స్థానికులు.

ఇదీ చూడండి:సర్కార్​ నిబంధనతో ఉదయమే టపాసుల మోత...!

ABOUT THE AUTHOR

...view details