తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళపై కరోనా పంజా.. ఒక్కరోజే 6,357 కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా..పలు రాష్ట్రాల్లో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. కేరళలో శనివారం అత్యధికంగా 6,357 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 4 వేలకుపైగా మందికి వైరస్​ సోకింది. అయితే.. కొత్త కేసులతో పోలిస్తే కోలుకునే వారు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

corona cases
దేశవ్యాప్తంగా కరోనా కేసులు

By

Published : Nov 14, 2020, 9:29 PM IST

దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం కొత్తగా 6,357 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 6,793 మంది కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5.20 లక్షలకు చేరింది. ఇవాళ 26 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,848కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,523కు చేరింది.

  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 4,237 మందికి వైరస్​ సోకింది. 105 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,44,698కి చేరింది. మరణాల సంఖ్య 45,914కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 92.41 శాతం, మరణాల రేటు 2.63 శాతంగా ఉంది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో శనివారం కొత్తగా 2,361 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5.10 లక్షలకు చేరగా.. మరణాలు 7,354కు చేరాయి. ప్రస్తుతం 23,367 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 4.79 లక్షల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 93 శాతానికి చేరుకుంది.
  • కర్ణాటకలో కొత్తగా 2,154 మందికి వైరస్​ సోకింది. 2,198 మంది కోలుకున్నారు. 17 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 8,60,082కు చేరింది. మరణాలు 11,508కు చేరాయి. ఇప్పటి వరకు 8,20,590 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో వైరస్​ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. శనివారం కొత్తగా 1,912 కేసులు, 12 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 7.56 లక్షలకు చేరగా, మరణాలు 11,466కు చేరాయి. 17,154 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • గుజరాత్​లో శనివారం 1,124 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,87,240కి చేరింది. ఆరుగురు మరణించారు. అహ్మదాబాద్​లో ఇద్దరు, అమ్రేలి, బనాస్కాంఠా, గాంధీనగర్​, సూరత్​లలో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 3,797కు చేరింది. శనివారం 995 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
  • మధ్యప్రదేశ్​లో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 1,012 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వైరస్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,83,057, మరణాలు 3,083కు చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 1,70,969 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్​లో కొత్తగా 112 వైరస్​ కోసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,750కి చేరింది. దిమాపుర్​లోనే అత్యధికంగా 109 మందికి వైరస్​ సోకటం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలో ప్రస్తుతం 805 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 8,794 మంది కోలుకున్నారు.
  • గోవాలో కొత్తగా 84 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ కారణంగా ఒకరు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 45,845, మరణాలు 659కి చేరాయి. శనివారం 145 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 43,533కు చేరాయి. ప్రస్తుతం 1,653 మంది చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details