కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
ఐదు జిల్లాల(కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, వయనాడ్)లో మొత్తం 451 స్థానిక సంస్థల పరిధిలోని 8,116 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లక్షా 23వేల 643 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. వీటిలో 473 సమస్యాత్మకమైనవిగా పేర్కొంటూ.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం 63,187 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.