తెలంగాణ

telangana

కేరళలో జోరుగా 'స్థానిక పోరు'- ఓటేసిన సీఎం

By

Published : Dec 14, 2020, 1:27 PM IST

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల చివరి దశ పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. నాలుగు జిల్లాల్లో మొత్తం 354 స్థానాలకు ఓటింగ్​ జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కన్నూర్​ జిల్లా కేంద్రంలో ఓటు వేశారు.

Kerala Local body polls
కేరళలో జోరుగా తుదిదశ స్థానిక పోరు- ఓటేసిన సీఎం

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాష్ట్ర సీఎం పినరయి విజయన్​.. కన్నూర్​ జిల్లాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

ఓటేస్తున్న సీఎం పినరయి విజయన్​

నాలుగు జిల్లాల(మలప్పురం, కోజికోడ్​, కన్నూర్​, కాసరాగోడ్​)లో మొత్తం 354 స్థానిక సంస్థల పరిధిలోని 6,867 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 10,842 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు​​. వీటిలో సమస్యాత్మకంగా ఉన్న 1,105 కేంద్రాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఓటేసేందుకు వచ్చిన మహిళలు

గత వారం ఐదు జిల్లాల్లో జరిగిన రెండో దశ స్థానిక పోరులో 76.38శాతం పోలింగ్​ నమోదవ్వగా.. అంతకముందు తొలిదశ పోలింగ్​లో 72.67 శాతం మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ నెల 16 ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎన్నికల విధుల్లో సిబ్బంది
కట్టుదిట్టమైన భద్రత నడుమ..

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) మధ్య జరుగుతున్న త్రిముఖ పోరు.. వచ్చే ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

ఇదీ చదవండి:వారే నిజమైన 'తుక్డే తుక్డే గ్యాంగ్​': కపిల్ సిబల్

ABOUT THE AUTHOR

...view details