కేరళ ఇడుక్కి జిల్లా రాజమలలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం మరో 16 మంది మృతదేహాలు శిథిలాలు కింది లభ్యమయ్యాయి. ఫలితంగా మృతుల సంఖ్య 42కు చేరింది. 24 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇడుక్కి దుర్ఘటనలో 42కు చేరిన మృతుల సంఖ్య - కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటన డెత్ టోల్
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఇంకా పలువురి ఆచూకీ తెలియలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శిథిలాల కింద మరో 16 మృతదేహాలు లభ్యం
శుక్రవారం జరిగిన ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేరళ సీఎం పినరయి విజయన్.. తక్షణమే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రూ. 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:చొరబాటు కుట్ర భగ్నం- ముష్కరుడు హతం