నారీశక్తి: ప్లాస్టిక్‌ను ఏరిపారేశారు..ఆదర్శ గ్రామంగా నిలిపారు! కేరళ ప్రభుత్వం ఆదర్శ పంచాయతీగా ఎంపిక చేసిన పెరినాడ్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కొల్లం జిల్లాలోని ఈ గ్రామంలో 40 మంది మహిళలు బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దారు. వీరి కృషికి మెచ్చిన జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచన మేరకు పెరినాడ్ను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
పొడిగా చేసి..
ఈ నలభై మంది నారీమణులు సరైన ప్రణాళికలు పాటిస్తూ గ్రామంలో వ్యర్థ పదార్థాలను సేకరిస్తున్నారు. ప్రతి వీధిలోనూ ప్లాస్టిక్ సంచులు, ఇతర పదార్థాలను వేరుగా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. సేకరించిన ప్లాస్టిక్‌ను యంత్రాల సాయంతో పొడిలా చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ పొడిని క్లీన్ కేరళ సంస్థకు తరలిస్తున్నారు.
విజయలక్ష్మి, అంబిలి, శేర్లీసు నాయకత్వం వహిస్తున్న ఈ బృందం ప్లాస్టిక్‌ను తరిమికొట్టడంలో విజయం సాధించారు. గ్రామంలో ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ వినాశిని యంత్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. వీరి ఆశయానికి స్థానికుల సహకారమూ అందుతోంది.
ఇదీ చూడండి:అదిరిపోయే స్టెప్పులతో.. అమెరికన్ల దీపావళి వేడుకలు