కేరళ ఎర్నాకులం పట్టణానికి చెందిన పదేళ్ల చిన్నారి సాన్వి ఎమ్ ప్రజీత్ తన ప్రతిభతో అందరినీ అబ్బురపరిచింది. గంటలో 33 వంటకాలు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
భారత వాయు సేన అధికారి వింగ్ కమాండర్ ప్రజీత్ బాబు, మంజిమ కూతురైన ఈ చిన్నారి రుచికరమైన వంటకాలు చేయడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఏం వండింది?
ఇడ్లీ, వాఫుల్, కార్న్ ఫ్రిట్టర్స్, మష్రూమ్ టిక్కా, ఊతప్పం, పనీర్ టిక్కా, ఎగ్ బుల్స్ ఐ, సాండ్విచ్, పాపిడి ఛాట్, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్, పాన్కేక్, అప్పం మొదలైన 33 వంటకాలు చేసి సాన్వి రికార్డు సాధించింది.
ఆగస్టు 29న పదేళ్ల వయసులోనే సాన్వి ఈ భిన్నమైన వంటకాలు చేసి అందరి మన్ననలు పొందింది.
" విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వంటల కార్యక్రమాన్ని ఆసియా బుక్ ఆఫ్ రికార్డు అధికారులు ఆన్లైన్ ద్వారా చూశారు. ఇద్దరు అధికారులు ప్రత్యక్షంగా కార్యక్రమానికి హాజరయ్యారు "