తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు - బంగారం కుంభకోణం

కేరళలో ఇటీవల కస్టమ్స్​ అధికారులు పట్టుకున్న బంగారం కేసు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. రాజకీయంగా పెద్ద దుమారం కావటం వల్ల ఆ రాష్ట్ర ఐటీ కార్యదర్శి ఎమ్​ శివశంకర్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ కేసు విచారణ సీబీఐతో జరిపించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి.

Kerala IT Secretary removed as CM's Secretary
బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు

By

Published : Jul 7, 2020, 3:58 PM IST

Updated : Jul 7, 2020, 8:22 PM IST

బంగారం స్మగ్లింగ్‌ కుంభకోణం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి విజయన్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను చూస్తున్న కేరళ ఐటీ కార్యదర్శి ఎమ్‌ శివశంకర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కొద్దిగంటలకే ఐటీ శాఖ కార్యదర్శి పదవి నుంచీ తప్పించారు. బంగారం స్మగ్లింగ్‌ కుంభకోణంలో నిందితురాలైన స్వప్నా సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించినందుకే.. శివశంకర్‌ను తొలగించినట్లు కేరళ సీఎంవో తెలిపింది.

స్వప్నా సురేశ్‌

రాజకీయ దుమారం..

కేరళలో బంగారం స్మగ్లింగ్‌ వివాదం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ కార్యాలయం తలుపు తట్టింది. ఈ కేసుతో.. సంబంధముందన్న ఆరోపణలతో సీఎం కార్యదర్శిగా అదనపు బాధ్యతలను చూస్తున్న ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను రెండు బాధ్యతల నుంచి తప్పించారు.

బంగారం అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నాసురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడంపై రాజకీయంగా దుమారం రేపింది. దీంతో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. స్వప్నా సురేశ్‌ను ఐటీ శాఖలోకి ఏ విధంగా తీసుకున్నారనే అంశంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, శివశంకర్‌ నుంచి వివరణ కోరనున్నారు. మరోవైపు నిందితురాలు స్వప్నా సురేశ్‌.. ముఖ్యమంత్రి విజయన్‌తో కలిసి ఉన్న చిత్రాలు సంచలనంగా మారాయి.

బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు
పినరయ్​ విజయన్​తో స్వప్నా సురేశ్​

30 కిలోల బంగారం..

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు స్వప్నాపై లుక్​ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారంతో....

సాధారణంగా కన్‌సైన్‌మెంట్‌గా పేర్కొనే పార్సిళ్లను తనిఖీ చేయరు. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. పట్టుబడ్డ నిందితుడు సరిత్‌, గతంలో కేరళలోని యూఏఈ కాన్సులేట్‌లో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశాడు. స్వప్నా సురేశ్‌ కూడా ఇదే కార్యాలయంలో పనిచేసింది. దీంతో కేరళ ఐటీ శాఖలో పనిచేసే స్వప్నా సురేశ్‌ బంగారం స్మగ్లింగ్ కోసం నకిలీ కాన్సులేట్‌ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసిన స్వప్నా‌ను కేరళ ఐటీ శాఖలో ఏ ప్రాతిపదికన నియమించారనే అంశంపైనే .. శివశంకర్‌ను తొలగించినట్లు సమాచారం.

సీబీఐతో విచారణ...

కేరళలో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇదీ చూడండి:వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు

Last Updated : Jul 7, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details