తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శరవేగం.. కేరళలో 'ఈనాడు' ఇళ్ల నిర్మాణం - welfare fund

కేరళ వరద బాధితుల కోసం అలప్పుజలో 'ఈనాడు సహాయనిధి'తో నిర్మిస్తున్న తొలి దశ ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. చాలా వరకు పునాదుల వరకు పనులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులను మహిళలే చేస్తున్నారు.

ఇంటి నిర్మాణ పనులు

By

Published : Apr 2, 2019, 6:05 AM IST

Updated : Apr 2, 2019, 8:08 AM IST

వేగంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
కేరళ వరదల్లో నిరాశ్రయులైన వారి కోసం 'ఈనాడు' తలపెట్టిన బృహత్తర కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. అలప్పుజలో 'ఈనాడు సహాయ నిధి'తో నిర్మిస్తున్న ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

పునాదులు పూర్తి..

తొలిదశలో భాగంగా 43 ఇళ్లను నిర్మిస్తున్నారు. దాదాపు వీటి పునాదుల పని పూర్తయింది. నిర్మాణ పనులన్నీ కుటుంబ శ్రీ మిషన్​ కింద మహిళలే చేస్తున్నారు.

పూర్తయిన పునాది

రెండు పడక గదులు

వరద బాధితుల కోసం 'ఈనాడు' నిర్మిస్తున్న ఈ ఇళ్లలో రెండు పడక గదులు ఉండనున్నాయి. అలాగే హాలు, వంటగది, బాత్​రూం సౌకర్యాలు ఉంటాయి.

ఇంటి నిర్మాణ పనుల్లో చెమటోడుస్తున్న మహిళలు

లక్ష్యం 116

రూ.7కోట్ల70 లక్షల 'ఈనాడు సహాయ నిధి'తో మూడు దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం. కలెక్టరు కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఈ ఇళ్ల పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. మార్చి 2న ఇళ్ల నిర్మాణాలను శంకుస్థాపన జరిగింది.

Last Updated : Apr 2, 2019, 8:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details