తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ: అంగరంగ వైభవంగా ట్రాన్స్ ఉమన్​ వివాహం - కేరళలో అంగరంగ వైభోగంగా ట్రాన్స్ వుమన్​ వివాహం

కేరళ ఎర్నాకుళంలో ట్రాన్స్ ఉమన్​ హైది సాదియా, అథర్వ్​ మోహన్​ల వివాహం ఘనంగా జరిగింది. ఎల్​జీబీటీక్యూ వివాహాలను చట్టబద్ధం చేస్తూ కేరళ ప్రభుత్వం 'ప్రత్యేక వివాహ చట్టం' తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం జరిగిన నాలుగో ట్రాన్స్ జెండర్ వివాహమిది.

Heidi Saadiya, the first transwoman journalist tied knot with Atharv Mohan in kerala
కేరళ: అంగరంగ వైభోగంగా ట్రాన్స్ వుమన్​ వివాహం

By

Published : Jan 26, 2020, 9:11 PM IST

Updated : Feb 28, 2020, 1:53 AM IST

కేరళ ఎర్నాకుళంలో మరో ట్రాన్స్ జెండర్ వివాహం జరిగింది. జర్నలిస్టుగా పనిచేస్తున్న ట్రాన్స్ ఉమన్ హైది సాదియా, అథర్వ్​ మోహన్​లు వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వధూవరులను ఆశ్వీర్వదించారు.

కేరళ ప్రభుత్వం 'ఎల్​జీబీటీక్యూ'... అంటే లెస్బియన్​, గే, బైసెక్సువల్​, ట్రాన్స్​ జెండర్​ల వివాహాలను చట్టబద్ధం చేస్తూ 'ప్రత్యేక వివాహ చట్టం' తీసుకొచ్చింది. సాదియా వివాహంతో కలిపి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో నాలుగు ట్రాన్స్ జెండర్ పెళ్లిళ్లు జరిగాయి.

ఇదీ చూడండి: అత్యధిక హెచ్​డీ ఛానల్స్​ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే!

Last Updated : Feb 28, 2020, 1:53 AM IST

ABOUT THE AUTHOR

...view details