తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చట్టాల రద్దుకు అసెంబ్లీ సెషన్​- గవర్నర్​ తిరస్కరణ - పినరయి విజయన్​

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. కేరళలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ తిరస్కరించారు. గవర్నర్​ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆరోపించారు. కాంగ్రెస్​ కార్యకర్తలు రాజ్​భవన్​ ముట్టడికి ప్రయత్నించారు.

Kerala Guv denies permission to convene session to pass motion against farm bills
చట్టాల రద్దుకు అసెంబ్లీ సెషన్​- గవర్నర్​ తిరస్కరణ

By

Published : Dec 23, 2020, 6:16 AM IST

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. కేరళలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పినరయి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ అందుకు తిరస్కరించారు. ప్రత్యేక సమావేశాలకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వివరణ సరిగా లేదని అన్నారు.

రైతులకు సంఘీభావంగా బుధవారం ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్ర చట్టాలకు వ్యతిరేక తీర్మానం చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం నిర్ణయాన్ని గవర్నర్​ తోసిపుచ్చారు. అయితే.. గవర్నర్​ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి ఆరోపించారు.

కాంగ్రెస్​ ఆందోళన..

గవర్నర్​ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజ్​భవన్​ ముట్టడికి యత్నించారు కాంగ్రెస్​ కార్యకర్తలు. అయితే.. అప్రమత్తమైన పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అక్కడే బైఠాయించిన కాంగ్రెస్​ నేతలు.. గవర్నర్​కు వ్యతిరేకంగా నినదించారు.

రాజ్​భవన్​ ముట్టడికి కాంగ్రెస్​ నేతల యత్నం
జలఫిరంగుల ప్రయోగం
చెదరగొట్టిన పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్​ కార్యకర్తలు

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రతిపాదనను గవర్నర్​ తిరస్కరించడం కేరళలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇదీ చూడండి:వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

ABOUT THE AUTHOR

...view details