పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం తాజాగా.. జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్)ను కూడా అమలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమనే విషయాన్ని జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్‌కు తెలియజేయనున్నట్లు పినరయి విజయన్ ప్రభుత్వం వెల్లడించింది. గత నిబంధనల ప్రకారమే జనాభా లెక్కలను సేకరిస్తామని తెలిపింది.
"సాధారణ ప్రజలకున్న భయాల నుంచి ఉపశమనం కలిగించడం సహా, రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన ప్రభుత్వ బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నాం."