కేరళలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కేసులను అరికట్టేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ సర్కార్. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం విధించిన తాజా నిబంధనలు అక్టోబర్ 3 ఉదయం 9గంటల నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు సెక్షన్-144 అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కరోనాను నియంత్రించేందుకు భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఒకేచోట ఐదుగురికంటే ఎక్కువ మంది సమావేశమవడాన్ని నిషేధించింది. అయితే.. శుభకార్యాలు, అంత్యక్రియలు మొదలగువాటికి సడలింపు ఉంటుంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి.