పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ సర్కారు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. లౌకికవాదం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉండటం సహా రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణలను సీఏఏ ఉల్లఘిస్తోందని కేరళ సర్కారు ఆరోపించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
సీఏఏను సవాల్ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్
రాజ్యాంగంలోని లౌకికవాదం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేరళ సర్కారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది.
సీఏఏను సవాల్ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్
సీఏఏకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కేరళ శాసనసభ డిసెంబర్‌లో తీర్మానం ఆమోదించింది.
ఇదీ చూడండి: నేటి నుంచి 'రైజీనా డైలాగ్'- ప్రారంభోత్సవానికి మోదీ
Last Updated : Jan 14, 2020, 4:37 PM IST