తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ - కేరళ సముద్ర అంబులెన్స్

అత్యాధునిక సముద్ర అంబులెన్సులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 24 గంటలు నిపుణులైన సహాయక బృందాలు అందుబాటులో ఉండేలా అంబులెన్సులను రూపొందించారు.

Kerala government launches three marine ambulances
సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ

By

Published : Aug 29, 2020, 5:10 PM IST

మత్స్యకారులకు రక్షణ కల్పించడానికి మూడు అత్యాధునిక సముద్ర అంబులెన్స్‌లను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ప్రతీక్ష అనే అంబులెన్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ మంత్రి జే మెర్సికుట్టి అమ్మ, ఆ శాఖ కార్యదర్శి టింకు బిస్వాల్ పాల్గొన్నారు. ఇప్పటికే ప్రత్యక్ష, కారుణ్య అనే రెండు అంబులెన్సులను కొచ్చిన్ షిప్​యార్డ్ నుంచి ప్రారంభించారు. తిరువనంతపురంలో ప్రతీక్ష, ఎర్నాకులంలో ప్రత్యక్ష, కోజికోడ్​లో కారుణ్య అంబులెన్సును అందుబాటులో ఉంచనున్నారు.

సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ

తుఫాను పునరావాసంలో భాగంగా..

ఓకి తుఫాను సంభవించిన సమయంలో సముద్ర అంబులెన్సులు లేకపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం అంబులెన్సులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఓకి పునరావాస ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్టును రూపొందించింది.

అంబులెన్సు ప్రత్యేకతలు

రూ.18.24 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో వీటిని రూపొందించారు. ఈ అంబులెన్సులను 23 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల వెడల్పు ఉండేలా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన టెక్నాలజీని సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అందించింది.

ఈ అంబులెన్సుల్లో ఒకేసారి 10 మంది బాధితులను తీరానికి చేర్చవచ్చు. వైద్య పరికరాలు, నిపుణులు, పారామెడికల్ సిబ్బంది అంబులెన్సుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన నాలుగు సముద్ర సహాయక బృందాలు ఉంటాయి.

వ్యయం ఇలా..

మొత్తం వ్యయంలో రూ.7.36 కోట్లు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి, మరో రెండు కోట్లు మత్స్య శాఖ నుంచి కేటాయించారు. ఓ అంబులెన్సు తయారీ ఖర్చు పూర్తిగా భారత్ పెట్రోలియం భరించింది. మరో అంబులెన్సు నిర్మాణంలో సగం వ్యయం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొచ్చిన్ షిప్​యార్డ్ అందించింది.

ఇదీ చదవండి-భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో సొరంగం

ABOUT THE AUTHOR

...view details