తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగారం స్మగ్లింగ్ నిందితుడికి 'బ్లూకార్నర్​' నోటీసులు! - faisal fareed interpol

కేరళ బంగారం అక్రమ రవాణా కేసులో మూడో నిందితుడైన ఫైజల్ ఫరీద్​కు బ్లూకార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్​పోల్​ను కోరింది ఎన్​ఐఏ. ఈ మేరకు ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్​బెయిల్​ వారెంట్​ను ఇంటర్​పోల్​కు అందజేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యూఏఈ రాయబార కార్యాలయంలో పనిచేసే గన్​మెన్​ వాంగ్మూలాన్ని జుడీషియల్ మేజిస్ట్రేట్​ నమోదు చేసింది.

Kerala gold
kకేరళ

By

Published : Jul 18, 2020, 3:14 PM IST

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో నిందితుడైన ఫైజల్ ఫరీద్​కు బ్లూకార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్​పోల్​ను జాతీయ దర్యాప్తు బృందం కోరింది. నిందితుడు దుబాయిలో ఉన్నాడని అధికారులు అనుమానిస్తుండగా.. ఫరీద్​పై కొచ్చిలోని ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్​ను ఇంటర్​పోల్​కు అందజేయనున్నట్లు ఎన్​ఐఏ తెలిపింది.

యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్​ రాయబార కార్యాలయానికి చెందిన ముద్ర, చిహ్నాన్ని ఫోర్జరీ చేసి నేరాలు చేసేవాడని కోర్టుకు ఎన్​ఐఏతెలిపింది.

"వారు(నిందితులు) పంపించే వస్తువులకు దౌత్య రక్షణ ఉండేలా పత్రాలను ఫైజల్ ఫరీద్ ఫోర్జరీ చేసేవాడు. ఈ కేసులో ఫరీద్ మూడో నిందితుడు. కేరళకు తీసుకొచ్చిన బంగారం ఆభరణాల కోసం కాకుండా ఉగ్ర కార్యకలాపాల కోసం ఉపయోగించారు. 2019లో నిందితుడు రెండుసార్లు బంగారం స్మగ్లింగ్ చేశాడు. ఒకసారి 18 కిలోలు, మరోసారి 9 కిలోలు బంగారం తీసుకొచ్చాడు."

-కోర్టులో ఎన్​ఐఏ

గన్​మెన్ వాంగ్మూలం నమోదు

బంగారు అక్రమ రవాణా కేసులో నిందితుల సహాయకులు బెదిరింపులకు పాల్పడటం వల్ల ఆత్మహత్యకు యత్నించిన యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే గన్​మెన్​ వాంగ్మూలాన్ని తిరువనంతపురంలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నమోదు చేసింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఆస్పత్రిలో జయఘోష్ వాంగ్మూలం తీసుకుంది.

రక్తపు మడుగులో..

జయఘోష్​ను సాయుధ రిజర్వు బలగాల అధీనంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అయితే గురువారం రాత్రి నుంచి జయఘోష్ జాడ కనిపించలేదని చెప్పారు. అనంతరం అక్కులం ప్రాంతంలోని తన నివాస సమీపంలో రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడని గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన జయఘోష్!

బంగారం అక్రమ రవాణాలో నిందితులకు సంబంధం ఉన్న వ్యక్తులు జయఘోష్​ను బెదిరించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తాను నిర్దోషినని, కేసుతో తనకెలాంటి సంబంధం లేదని జయఘోష్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ABOUT THE AUTHOR

...view details