ఔరా: పెన్సిల్ నిబ్‌పై వందేమాతరం! పెన్సిల్‌ను సాధారణంగా డ్రాయింగ్ వేయడానికి, రాయడానికి ఉపయోగిస్తారు. కేరళ కొట్టాయం జిల్లాలోని చంగనస్సెరికి చెందిన హుస్నా మాత్రం కొత్త కోణం వెతికింది. పెన్సిల్ నిబ్‌పై ఆకృతులు చెక్కే సూక్ష్మకళను ఆన్లైన్లో నేర్చుకుని రికార్డులు సృష్టిస్తోంది.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డుతో హుస్నా, ఆమె తండ్రి పెన్సిల్ నిబ్‌పై ఆకృతులు చెక్కుతున్న హుస్నా కేవలం వారంలోనే...
కేవలం వారం రోజుల్లో జాతీయ గేయం వందేమాతరం మొత్తాన్ని పెన్సిళ్ల నిబ్‌పై చెక్కి ఔరా అనిపించింది. బీబీఏం మూడో ఏడాది చదువుతున్న హుస్నా... ఏడాదిన్నరగా తన సృజనాత్మకతకు పదును పెడుతూ అద్భుతాలు చేస్తోంది. ఇప్పటివరకు 100కు పైగా ఆకృతులను చెక్కినట్లు తెలిపింది.
గాజు సీసాలో పెన్సిల్ నిబ్ చైన్ లింక్ హుస్నా సృజనాత్మకతకు నిదర్శనం పెన్సిల్ చివర బైక్ ఆకృతి పెన్సిల్ నిబ్‌పై ఆకృతులు చెక్కడానికి కఠోర శ్రమ, సహనం, ఏకాగ్రత అవసరం. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో తాను ఇలాంటి ఆకృతులు చెక్కుతున్నట్లు చెప్పుకొచ్చింది హుస్నా. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సాధించాలన్నదే తన ఆశయమని చెప్పింది.
ఉట్టిపడుతున్న హుస్నా సూక్ష్మకళ చైన్‌లా తయారు చేసిన పెన్సిల్ లీడ్ పెన్సిల్ నిబ్‌పై ప్రేమజంట ఇదీ చూడండి:భారత్ x చైనా: సైనిక శక్తిలో ఎవరిది పైచేయి?