లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకునే ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ఇందుకోసం రూ.50 లక్షల నిధులను కేటాయించింది. లింగమార్పిడి చేసుకునే వారికి ఇప్పటి వరకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. దానిని గణనీయంగా పెంచినట్లు వెల్లడించారు.
" మగవారిగా లింగమార్పిడి చేసుకోవాలనుకునేవారికి గరిష్ఠంగా రూ.2 లక్షలు అందేవి. కానీ, శస్త్రచికితలు, దానికి సంబంధించిన ఖర్చులు పెరగటం వల్ల ఈ నగదును రూ.5 లక్షలకు పెంచాం. అదేవిధంగా.. మహిళలుగా లింగమార్పిడి చేసుకోవాలనుకునే వారికి రూ.2.50 లక్షల అందనున్నాయి. "