తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జుగాడ్​' పవర్​ బ్యాంకులతో వరదల్లో వెలుగులు - పవర్​ బ్యాంక్

కేరళలో వరద బాధితులకు సాయంగా పవర్​ బ్యాంకులు అందించాలని నిర్ణయించారు  ఓ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు. ఐటీ నిపుణుల మార్గనిర్దేశంలో 270 పవర్​ బ్యాంకులను తయారు చేశారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న వయనాడ్​లో పంపిణీ చేశారు.

పవర్​ బ్యాంకులతో వరదల్లో వెలుగులు

By

Published : Aug 18, 2019, 12:36 PM IST

Updated : Sep 27, 2019, 9:31 AM IST

పవర్​ బ్యాంకులతో వరదల్లో వెలుగులు

భారీ వర్షాలతో దేవభూమి కేరళ అతలాకుతలం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు సాయంగా ఎవరికి తోచింది వాళ్లు విరాళంగా ఇస్తున్నారు. కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు.

నిపుణుల సాయంతో...

వరదలు వస్తే విద్యుత్​కు దూరంగా ఉండాల్సిందే. ఈ సమయంలో మొబైల్​ ఛార్జింగ్​ చేసుకునేందుకు ఏదైనా సదుపాయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా నిపుణుల సూచనలతో పవర్​ బ్యాంకులు తయారు చేశారు. ఇందుకు సహాయ ఆచార్యుడు నితీశ్​ కురియన్​ సారథ్యం వహించారు.

మొత్తంగా 270 పవర్​ బ్యాంకులు తయారు చేసి వయనాడ్​లో అందించారు. ఈ చర్యను పలువురు మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: గాంధీ 'ఐకమత్య' పునాదులతోనే నేటి శాంతి వెలుగులు

Last Updated : Sep 27, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details