కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మూడో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫాజిల్ ఫరీద్ వాంగ్మూలాన్ని కస్టమ్స్ అధికారులు తీసుకున్నారు. ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్న ఫాజిల్‌తో ఫోన్లో సంభాషించి వివరాలు సేకరించారు.
మరో ఇద్దరు నిందితులు స్వప్న సురేశ్, సందీప్ నయ్యర్‌కు కరోనా నెగటివ్ వచ్చిన నేపథ్యంలో సోమవారం ఎన్ఐఏ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు అధికారులు. విచారణ నిమిత్తం 10 రోజుల రిమాండ్ కోరనున్నారు. ఈ మేరకు బెంగళూరు నుంచి కోచి ఎన్ఐఏ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు.