తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడిపోయారు - కేరళ

కేరళలోని ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్న పడవలో కూర్చున్న ఓ యువ జంట అదుపు తప్పి నీటిలో పడిపోవడం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడిపోయారు..

By

Published : Apr 19, 2019, 1:11 PM IST

ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాల్ని వీడియోలు, ఫొటోల రూపంలో దాచుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్​లు వస్తున్నాయి. కేరళలో ఇలాంటి ఫొటోషూట్​లో జరిగిన చిన్న పొరపాటు.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

కేరళకు చెందిన తిజిన్, శిల్పలకు మే 6న వివాహం జరగనుంది. పంబా నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్​ ప్లాన్ చేసుకున్నారు. ఫొటో తీసుకునేందుకు పడవలో కూర్చున్న వీరిద్దరూ అదుపు తప్పి నీటిలో పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సుమారు 2 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఇది చదవండి: నవ వధువుల కోసం ప్రత్యేక డిజైన్లు

ABOUT THE AUTHOR

...view details