దేశంలో నమోదైన తొలి కరోనా కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. కేరళలో కరోనావైరస్ సోకినట్లు తేలిన ఓ వైద్య విద్యార్థినిని ప్రభుత్వాసుపత్రి నుంచి త్రిస్సూర్వైద్య కళాశాలకు చేర్చినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలోని మిగతా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
వుహాన్ వర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్న కేకే శైలజ.. కరోనా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. కాగా, నిన్న ఆమెకు కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. నేడు ఆమెను త్రిస్సూర్‌కు చేర్చారు. ఈ వైద్య కళాశాలలోని ప్రత్యేక వార్డును 24 మందికి ఒకే సారి చికిత్స అందించే విధంగా రూపొందించారు.
కరోనా వ్యాప్తి జరగకుండా కేరళ ప్రభుత్వం మరింత జాగ్రత్త వహిస్తోంది .. ఈ కారణంగా 1053 మంది అనుమానితులను పరిశీలనలో ఉంచింది.
దిల్లీలో ఆరుగురు..
ఇక దిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఆరుగురు చేరారు. వీరిలో ఐదుగురు స్వతహాగా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఐదుగురు కూడా సుమారు నాలుగేళ్లుగా చైనాలో ఉన్నవారే.. పైగా వీరంతా ఈ నెలాఖరులోనే భారత్‌కు వచ్చారు. వీరిని ప్రత్యేక వార్డులో పరీక్షలు నిర్వహించారు. అయితే, తుది నివేదిక వెలువడితే గానీ కరోనా నిర్ధరణ జరగదు. 21 విమానాశ్రయాల్లో అధికారులు ప్రయాణికులను పరీక్షిస్తున్నారు.
భారత్ ముందు జాగ్రత్త...