తెలంగాణ

telangana

ETV Bharat / bharat

4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం - Kerala's Bhageerathi Amma and Karthiyani Amma chosen for the Nari Shakti Puraskar

మహిళలు తలుచుకుంటే.. సాధించలేనిది ఏదీ లేదని మరోసారి నిరూపించారు ఆ ఇద్దరు బామ్మలు. మహిళా సాధికారత కోసం రికార్డు నెలకొల్పారు. 96 ఏళ్ల వయసులో ఒకరు, 105 ఏళ్లు నిండిన మరొకరు నాలుగో తరగతి పాసయ్యారు. అందుకే కేరళకు చెందిన ఈ ఇద్దరు బామ్మలను 'నారీశక్తి' పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.

Bhageerathi Amma won Nari Shakti Puraskar
4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

By

Published : Mar 5, 2020, 5:04 PM IST

కేరళకు చెందిన భాగీరథీ, కార్తియాని బామ్మలు.. అక్షరం ముక్క రాకపోయినా ఎన్నో బాధ్యతలు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని జీవితమనే బడిలో విజయం సాధించారు. ఇరువురికీ 105, 96 ఏళ్లు నిండినప్పటికీ ఇక మాకెందుకు చదువు అనుకోలేదు. అందుకే కష్టపడి నాలుగో తరగతి పరీక్షలు రాశారు. అంతేకాదు ఒకరు 75 శాతం, మరొకరు 98 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు వీరి కష్టాన్ని గుర్తించి నారీశక్తి-2019 అవార్డును అందించనుంది కేంద్ర ప్రభుత్వం.

కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్​లో భాగంగా 2018లో నాలుగో తరగతి పూర్తిచేశారు భాగీరథీ, కార్తియాని బామ్మలు. వయసుతో సంబంధం లేకుండా చదువు పట్ల వారు చూపిన శ్రద్ధ ఎందరికో ఆదర్శం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల 'మన్​కీ బాత్'​ కార్యక్రమంలో వీరి గురించి ప్రస్తావించారు.

ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నారీ శక్తి పురస్కారాన్ని అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ ​కోవింద్​ చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించనున్నారు.

ఇదీ చదవండి:హోలీపై కరోనా ప్రభావం- వేడుకలకు అగ్ర నేతలు దూరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details