దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వరుసగా రెండో ఏడాది 'ఆరోగ్య సూచీ' ర్యాంకులు కేటాయించింది నీతి ఆయోగ్. ఆరోగ్య ప్రమాణాలపై ఆయా రాష్ట్రాల్లో దీర్ఘకాల అధ్యయనం అనంతరం ఈ జాబితాను రూపొందించింది. కేరళ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరోగ్య ప్రమాణాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ది చిట్టచివరి స్థానం.
'ఆరోగ్య రాష్ట్రాలు- ప్రగతిశీల భారతదేశం' నివేదికను 2015-16 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు 23 ఆరోగ్య సూచికల ఆధారంగా రూపొందించారు. హరియాణా, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.