పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఉపసంహరించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు కొనసాగించేలా ఆమోదం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి విజయన్.
మతపరమైన వివక్షతో కూడుకున్న సీఏఏ.. దేశ లౌకిక విధానాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు విజయన్.రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు, మౌలిక సూత్రాలకు ఈ చట్టం విరుద్ధమన్నారు. కేరళలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టంచేశారు.