తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ వ్యవసాయ మంత్రికి కరోనా పాజిటివ్ - దిల్లీ ఉపముఖ్యమంత్రికి కరోనా

కరోనా వైరస్​ బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు వైరస్​ సోకగా.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈనెల 14న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాకు వైరస్​ సోకగా ఇవాళ ఎన్​ఎన్​జేపీ ఆస్పత్రిలో చేరారు. సిక్కిం సీఎం తమాంగ్​ భార్య క్రిష్ణరాయ్​కి వైరస్​ నిర్ధరణ అయింది.

Kerala Agriculture Minister V S Sunil Kumar
కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్

By

Published : Sep 23, 2020, 5:37 PM IST

దేశంలో కరోనా మహమ్మారి బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు కొవిడ్​-19 పాజిటివ్​గా తేలింది. ఆయనతో పాటు గన్​మెన్​కు కూడా వైరస్​ సోకింది. మంత్రితో పాటు ఆయన సిబ్బందిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు వైద్యులు.

కేరళలో కేబినెట్​లో వైరస్​ బారిన పడిన మూడో మంత్రి సునీల్​ కుమార్​. అంతకు ముందు పరిశ్రమలు, క్రీడల శాఖ మంత్రి ఈపీ జయరాజన్​, ఆర్థిక మంత్రి థామస్​ ఇసాక్​కు వైరస్​ సోకింది.

ముఖ్యమంత్రి భార్యకు కరోనా..

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్​ సింగ్ తమాంగ్​ భార్య క్రిష్ణరాయ్​తో పాటు ఆమె కుటుంబ సభ్యుల్లో పలువురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ మేరకు తన ఫేస్​బుక్​ పేజీ ద్వారా వెల్లడించారు రాయ్​. తనను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవాలని, హోంక్వారంటైన్​లో ఉండాలని కోరారు.

ఆస్పత్రిలో చేరిన దిల్లీ ఉప ముఖ్యమంత్రి..

కరోనా బారిన పడిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఇప్పటివరకు హోం ఐసొలేషన్​లో ఉన్న ఆయన... బుధవారం ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రిలో చేరారు.

ఇదీ చూడండి: 'రైతులకు ప్రయోజనంలేని 'ఎంఎస్​పీ'లు ఎందుకు?'

ABOUT THE AUTHOR

...view details