కేరళ ఇడుక్కీ జిల్లాలోని మున్నార్‌లో ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారి కదులుతున్న జీపు నుంచి కింద పడిపోయింది. అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్న జీపు.. చిన్న మలుపు తిరిగిన సమయంలో తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆ చిన్నారి కిటికీలో నుంచి బయట పడిపోయింది. తల్లిదండ్రులు నిద్రలో ఉన్నకారణంగా ఈ విషయాన్ని గమనించలేదు.
పసిపాప బిక్కు బిక్కుమంటూ తిరుగుతుండగా.. అటవీశాఖ అధికారులు గమనించి కాపాడారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్వల్పంగా గాయపడిన చిన్నారికి చికిత్స అందించి... తల్లిదండ్రులకు అప్పగించారు.