ఒడిశా కేంద్రపారా ఎంపీ అనుభవ్ మోహంతిపై ఆయన భార్య, ఒలివుడ్ ప్రముఖ నటి బార్షా ప్రియదర్శిని.. మహిళా భద్రత, గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. అనభవ్ తనను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పరిహారం కింద.. ఇంటి అద్దె కోసం నెలకు రూ. 20వేలు, ఇతర అవసరాల కోసం నెలకు రూ. 50వేలతో పాటు రూ. 15 కోట్లు అనుభవ్ నుంచి ఇప్పించాలని కోర్టును కోరారు ప్రియదర్శిని. కటక్ కోర్టు సోమవారంవిచారణ చేపట్టనుంది.