దిల్లీ యూనివర్సిటీ సహా మిగతా అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల చివరి ఏడాది పరీక్షలు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ... ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
తీవ్ర ఆగ్రహంతో...
వర్సిటీల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్, ఆఫ్లైన్ల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)... విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఆదేశించింది. దీనిపై విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.
"మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ), యూజీసీ పరీక్షలు రద్దు చేయడానికి సిద్ధంగా లేవు. అందువల్ల మీరు (మోదీ) జోక్యం చేసుకుని విశ్వవిద్యాలయాల ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. యువత భవితను కాపాడాలి."
- కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
అలా ఎందుకు చేయకూడదు