దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవంలో ఆమ్ ఆద్మీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. దిల్లీ ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని.. ప్రభుత్వం పనీతీరు చూసే ప్రజలు తమకు మరోసారి అధికారం కట్టబెట్టరాని ఆనందం వ్యక్తం చేశారు.
ఇది సామాన్యుడి విజయం: కేజ్రీవాల్ - kejriwal latest speech
దేశరాజధాని దిల్లీలో వరుసగా మూడోసారి విజయదుందుబి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మెచ్చే ప్రజలు తమకు మరోసారి అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
ఇది సామన్యుడి విజయం: కేజ్రీవాల్
సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యుత్, నీటి సరఫరా, పౌర సేవలే తమను గెలిపించాయని చెప్పారు కేజ్రీవాల్. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం చేసిన కృషిని చూసి ప్రజలు ఆప్‌ను ఆదరించారన్నారు. మరో ఐదేళ్ల పాటు అందరూ కష్టపడి పనిచేసి దిల్లీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్.
Last Updated : Mar 1, 2020, 12:08 AM IST