దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌పై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. దిల్లీలోని కరోనా బాధితులకు ఐదురోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌ను విధించిన గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకించారు కేజ్రీవాల్. దిల్లీలోనే ప్రత్యేక నియమాలు ఎందుకుండాలని డీడీఎమ్ఏ సమావేశం వేదికగా ప్రశ్నించారు.
లక్షణాలు లేని వారు, తేలికపాటి లక్షణాలున్న కరోనా బాధితులకు ఐసీఎంఆర్ హోం క్వారంటైన్‌ను సూచించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి.
"లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్న బాధితులే అధికంగా ఉన్నారు. మరి వారి కోసం ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఐసోలేషన్ కోసం రైల్వే అందించిన బోగీలు చాలా వేడిగా ఉన్నాయి. అందులో బాధితులు ఉండలేరు. గవర్నర్ ఆదేశాలు ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి."