దిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. వరుసగా మూడోసారి హస్తిన పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో.. నూతన ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరికి అవకాశం లభిస్తుందో అని దిల్లీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటయ్యే కేజ్రీ మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మంత్రులనే.. కొనసాగించాలని ఆప్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న.. మనీశ్ సిసోడియా, రాజేంద్రపాల్ గౌతమ్, సత్యేందర్ జైన్, కైలాశ్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ మరోమారు మంత్రులుగా పనిచేయనున్నారు.