తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాతో జాగ్రత్త.. నితీశ్​కు ఎంపీ హెచ్చరిక - mp adhir ranjan choudary tweets about bihar cm

మిత్రపక్షమైన భాజపాతో నితీశ్​కుమార్​ జాగ్రత్తగా ఉండాలని.. ఎంపీ అధిర్​ రంజన్​​ చౌదరి హెచ్చరించారు. లేకుంటే అరుణాచల్​ ప్రదేశ్​లో లాగే జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలతో సన్నిహితంగా ఉండటమే దీనికి విరుగుడు అని సూచించారు.

Keep in touch with opposition in Bihar, Adhir advises Nitish following Arunachal developments
భాజపాతో జాగ్రత్త.. నితీశ్​కు ఎంపీ హెచ్చరిక..

By

Published : Dec 27, 2020, 6:10 AM IST

లోక్​సభ కాంగ్రెస్​ పక్షనేత అధిర్​ రంజన్​​ చౌదరి.. బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ను హెచ్చరించారు. తన మిత్రపక్షమైన భాజపాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేకుంటే అరుణాచల్​ ప్రదేశ్​లో చేసినట్లుగానే ఇక్కడా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ఆ పరిస్థితి రావద్దంటే ప్రతిపక్షాలతో సన్నిహితంగా ఉండటమొక్కటే మార్గమని పేర్కొన్నారు.

గతేడాది అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్​కు చెందిన జేడీ(యూ) ఏడు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందింది. ఇటీవల వారిలో ఆరుగురిని భాజపా తమ పార్టీలో చేర్చుకోవడంపై ఎంపీ ట్విట్టర్​లో స్పందించారు. "ప్రియమైన నితీశ్​కుమార్ జీ, భాజపా పట్ల జాగ్రత్త వహించండి. వారికి ఇవతలి పార్టీ ఎమ్మెల్యేలను ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు. ఈశాన్య ప్రాంతంలో ఓ వేటాడే జంతువుకు ఉన్న నైపుణ్యం వీరికి ఉంది" అని అధిర్​ ట్వీట్​ చేశారు.

''అరుణాచల్​ ప్రదేశ్​లో కాషాయ పార్టీతో నితీశ్​కు అవమానం జరిగింది. దానితో సంబంధాలు తెంచుకొని.. ప్రధాన ప్రతిపక్షంతో జట్టు కట్టాలంటే అందుకు రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) సిద్ధంగా ఉంది. కమలం పార్టీని ఎదుర్కొవాలంటే.. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలతో సన్నిహితంగా మెలగండి. భాజపాను నిర్మించుకుంటూ పోవడమే ఆ పార్టీ సిద్దాంతం. అందుకోసం భాజపాయేతర పార్టీలను నాశనం చేసేందుకు అది సిద్ధంగా ఉంటుంది. అది సూర్యుని ఎండలో నిలబడి ఉంది. దాని దాహం తీరనిది.''

-అధిర్​ రంజన్​​ చౌదరి, కాంగ్రెస్​ ఎంపీ.

60 స్థానాలున్న అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 2019లో భాజపా 41 సీట్లు గెలుపొందింది. 15 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 7 చోట్ల గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details