తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేదార్​నాథ్, యమునోత్రి మందిరాలు మూసివేత - ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్ ఆలయం

శీతాకాలం రాక దృష్ట్యా ఇవాళ కేదార్​నాథ్, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. వచ్చే ఆరునెలల కాలంలో కేదార్​నాథుడు ఓంకారేశ్వర్​లో పూజలందుకుంటాడు.

కేదార్​నాథ్, యమునోత్రి మందిరాలు మూసివేత

By

Published : Oct 29, 2019, 3:09 PM IST

కేదార్​నాథ్, యమునోత్రి మందిరాలు మూసివేత

ఉత్తరాఖండ్​లోని పవిత్ర కేదార్​నాథ్​ మందిరాన్ని శీతాకాలం రాక దృష్ట్యా ఈరోజు ఉదయం మూసివేశారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 12 వందల మంది భక్తులు హాజరైనట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.

కేదార్​నాథ్​ దేవాలయంలోని పంచముఖ మహాశివుని విగ్రహాన్ని పూలపల్లకిలో ఊరేగిస్తూ ఉఖిమఠ్​​లోని ఓంకారేశ్వర దేవాలయానికి తీసుకెళ్తున్నారు. జమ్ముకశ్మీర్​ పదాతిదళ బృందం సంగీత వాయిద్యాల నడుమ ఈ యాత్ర సాగుతోంది. ఈ ఊరేగింపు రాంపుర్​, గుప్త్​కాశీ మీదుగా అక్టోబర్​ 31న ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంటుంది. వచ్చే ఆరు నెలలు కేదారనాథుడు ఇక్కడే పూజలందుకుంటాడు.

ఈ సీజన్​లో మొత్తంగా 9,97,585 మంది భక్తులు కేదార్​నాథ్​ మందిరాన్ని సందర్శించారని ఆలయ కమిటీ ప్రతినిధి తెలిపారు.

యమునోత్రి

ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అభిజీత్​ ముహూర్తానికి యమునోత్రి ధామ్​ తలుపులనూ మూసివేశారు. ఆ తరువాత సంప్రదాయ సంగీత వాయిద్యాలతో శనిదేవ్​ డోలీలో విగ్రహమూర్తిని ఊరేగిస్తూ యమునోత్రి నుంచి ఖుషమత్​కు బయలుదేరారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఈయూ ప్రతినిధుల బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details