తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర కుట్రకు పాల్పడిన మహిళకు కరోనా - Covid Positive for Hina Bashir Begh

సీఏఏ వ్యతిరేక నిరసల్లో ఉగ్రదాడి కుట్రకు పాల్పడ్డారనే కేసులో కీలక నిందితురాలైన కశ్మీరీ మహిళకు తాజాగా కరోనా వైరస్​ సోకింది. ఆమెను దిల్లీలోని లోక్​నాయక్​ జయ్​ప్రకాశ్​ నారాయణ్​ ఆసుపత్రిలో చేర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిందితురాలికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్​ జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

Kashmiri woman held for planning terror acts tests positive for COVID-19 in NIA custody
సీఏఏ కేసులో నిందితురాలైన కశ్మీర్​ మహిళకు కరోనా

By

Published : Jun 7, 2020, 7:48 PM IST

Updated : Jun 7, 2020, 8:14 PM IST

సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ) వ్యతిరేక నిరసనల్లో ఉగ్రదాడి కుట్రకు పాల్పడిన ఆరోపణలతో ఓ కశ్మీర్​ మహిళను పోలీసులు ఈ ఏడాది తొలినాళ్లల్లో అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) కస్టడీలో ఉన్న హీనా బషీర్​బేగ్​కు కరోనా వైరస్​ సోకినట్టు తాజాగా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా దిల్లీలోని లోక్​నాయక్​ జయ్​ప్రకాశ్​ నారాయణ్​ ఆసుపత్రిలో ఆమెను చేర్పించాలని ఆదేశించారు న్యాయమూర్తి.

వారికి నెగెటివ్​..

ఈ కేసులో హీనా, ఆమె భర్త జహన్​జైబ్​ సమీతో పాటు మరో వ్యక్తి అబ్దుల్​ బాసిత్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి కస్టోడియల్​ విచారణ ఆదివారంతో ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు శనివారం వీరికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. హీనా​కు వైరస్​ పాజిటివ్​గా తేలింది. మిగిలిన ఇద్దరికి వైరస్​ సోకలేదు. ఎన్​ఐఏ రిమాండ్​ కోరని నేపథ్యంలో.. వీరిని జ్యుడీషియల్​ కస్టడీకి పంపింది న్యాయస్థానం.

హీనా​కు రెండు నెలల మధ్యంతర బెయిల్​ ఇప్పించాలని ఆమె తరఫు న్యాయవాది ఎమ్​ఎస్​ ఖాన్ కోర్టును కోరారు. దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో.. ఆమెకు సరైన వైద్య సదుపాయాలు అందించలేని స్థితిలో ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు న్యాయవాది.

ఇస్లామిక్​ స్టేట్​తో సంబంధాలున్న ముగ్గురు నిందితులను.. మార్చి నెలలో దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 23న వారిని జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.
Last Updated : Jun 7, 2020, 8:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details