తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సంతతి ప్రొఫెసర్​కు అమెరికా రూ.13 కోట్ల ఫెలోషిప్​ - కశ్మీర్​ వాసికి అమెరిాక ప్రతిష్టాత్మక అవార్డ్​

భారత సంతతి అమెరికా ప్రొఫెసర్​ అరుదైన ఘనత సాధించారు. అమెరికా ప్రతిష్ఠాత్మక కెరీర్​ ఫెలోషిప్​ అవార్డ్​ను సాధించారు. మెదడుపై చేస్తున్న ప్రయోగానికి గాను యూఎస్​ నేషనల్ సైన్స్​​ పౌండేషన్​ దీనిని ప్రదానం చేసింది. ఇందుకుగాను ఐదేళ్ల కాలంలో రూ.13 కోట్ల ఫెలోషిప్​ అందనుంది.

US bags $1.8million fellowship
అమెరికా 13 కోట్ల ఫెలోషిప్​

By

Published : Jan 16, 2021, 2:38 PM IST

Updated : Jan 16, 2021, 2:59 PM IST

కశ్మీర్​కు చెందిన ఇండో అమెరికన్ ప్రొఫెసర్ ముబారక్​ ఉస్సేన్​ సయ్యద్​ ప్రతిష్ఠాత్మక కెరీర్​ అవార్డ్​ను కైవసం చేసుకున్నారు. మెదడు పనితీరుపై చేసిన ప్రయోగానికి గాను ఈ అవార్డును యూఎస్​ నేషనల్ సైన్స్​​ ఫౌండేషన్​ ప్రదానం చేసింది. ఇందులో భాగంగా ఐదేళ్ల కాలానికి రూ.13 కోట్ల 16 లక్షల ఫెలోషిప్​ను అందించనున్నారు. అమెరికా న్యూ మెక్సికో యూనివర్సిటీ న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్​గా సయ్యద్​ పనిచేస్తున్నారు.

మెదడు అభివృద్ధి, పనిచేసే విధానంలో పరిశోధన చేయడానికి ఈ బహుమతి ఆయనకు ఉపయోగపడనుంది. కశ్మీర్​లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్​ స్థానికంగానే విద్యనభ్యసించారు. జర్మనీలో పీహెచ్​డీ పూర్తి చేశారు.

ఈ బహుమతి సాధించడంపై సయ్యద్​ కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక యువత తమ కలలను సాకారం చేసుకునే దిశలో ఈ విజయం స్ఫూర్తినిస్తుందని అన్నారు.

ఇదీ చదవండి:బైడెన్​ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు

Last Updated : Jan 16, 2021, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details