జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా బందిపొరా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు.
బందిపొరాలో తీవ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాయి భద్రతా బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.