కశ్మీర్‌తో భారత్‌ను కలిపే కీలకమైన రైలు వంతెన నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. ప్రపంచంలో ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైలు వంతెన పూర్తయితే కశ్మీర్.. భారత్‌తో అనుసంధానం అవుతుందని కొంకణ్ రైల్వే తెలిపింది.
"150 ఏళ్ల భారత రైల్వే చరిత్రలోనే ఈ ప్రాజెక్ట్ అత్యంత సవాల్‌తో కూడుకున్నది. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన.. కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానిస్తుంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం డిసెంబర్ 2021నాటికి పూర్తికానుంది."
- సంజయ్ గుప్తా, కొంకణ్ రైల్వే ఛైర్మన్
ఇంజనీరింగ్ అద్భుతం!
శత్రుదేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న ఈ ప్రాంతంలో నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ. గంటకు 260 కి.మీ వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా 1.315 కిలోమీటర్ల మేర ఈ వంతెనను రూపొందిస్తున్నారు.