కశ్మీర్‌ను చలి పులి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం కశ్మీర్ లోయలో కనిష్ఠానికి కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో రికార్డు స్థాయిలో దాదాపు -30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించారు.
కార్గిల్‌లో ఎన్నడూ లేని విధంగా -27.8 డిగ్రీలు, లద్దాఖ్ లోని లేహ్ జిల్లాలో -16.4 డిగ్రీలు, పాహల్గ్రామ్ ప్రాంతంలో -12.5 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో -11.5 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
గరిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు..