తెలంగాణ

telangana

కశ్మీర్​, సీఏఏ సంగతి మోదీ చూసుకోగలరు: ట్రంప్​

By

Published : Feb 25, 2020, 6:34 PM IST

Updated : Mar 2, 2020, 1:29 PM IST

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దుపై మాట్లాడేందుకు ఏమీ లేదని ట్రంప్​ అన్నారు. అది భారత అంతర్గత విషయమని ట్రంప్​ స్పష్టం చేశారు. కశ్మీర్​ వివాదాన్ని మోదీ చూసుకోగలరని ధీమా వ్యక్తం చేశారు.

trump
ట్రంప్

దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్టికల్​ 370, సీఏఏ, కశ్మీర్​ అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

పాక్​ నుంచి వచ్చే ఉగ్రముప్పుపై మోదీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరని ట్రంప్​ ధీమాగా చెప్పారు. కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై విలేకర్లు గుచ్చిగుచ్చి అడగగా ఆ అంశం మోదీ చూసుకుంటారని ట్రంప్​ సమాధానమిచ్చారు.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

"పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్‌ నుంచి ఉన్న ఉగ్ర ముప్పుపై మోదీ జాగ్రత్తలు తీసుకోగలరు. మోదీ దృఢమైన వ్యక్తి. కశ్మీర్ అంశాన్ని ఆయన చూసుకోగలరు.

మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ దృఢంగా ఉంటారు. భారత్‌, పాక్ మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇరుదేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని గతంలోనే చెప్పా. కశ్మీర్‌ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడేందుకు ఏమీ లేదు.. అది భారత్‌ అంతర్గత విషయం"- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Last Updated : Mar 2, 2020, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details