జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ విడుదల కోరుతూ మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ. తాజాగా హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవటాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
" నా తల్లి నిర్బంధం చట్ట విరుద్ధం. ఆమె బయటి ప్రపంచానికి చాలా రోజులుగా దూరంగా ఉన్నారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కూడా చట్టవిరుద్ధంగా, అకారణంగా తొలగించారు. ఏడాది కాలంగా ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచారు. గతవారమే పిటిషన్ దాఖలు చేశాం. ఫిబ్రవరిలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం ఇంకా సమాధానం ఇవ్వలేదనే విషయాన్ని తాజా రిట్ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఇది సుప్రీం కోర్టుపై వారికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. నా తల్లి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలను కలవకుండా ఆమెను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నారు.
- ఇల్తిజా ముఫ్తీ