తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్రిక్త కశ్మీరం నుంచి యాత్రికులు, విద్యార్థుల ఇంటిబాట - యాత్రికులు

జమ్ముకశ్మీర్​లో బలగాల మోహరింపు కొనసాగుతోంది. తక్షణ స్పందన దళం, సీఆర్​పీఎఫ్​ సహా ఇప్పటికే 100 కంపెనీల బలగాలను రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. అమర్​నాథ్​, మచైల్​ మాత యాత్రలను ప్రభుత్వం రద్దు చేయడం వల్ల యాత్రికులు గందరగోళంలో ఉన్నారు.

ఉద్రిక్త కశ్మీరం నుంచి యాత్రికులు, విద్యార్థుల ఇంటిబాట

By

Published : Aug 3, 2019, 1:08 PM IST

Updated : Aug 3, 2019, 3:34 PM IST

ఉద్రిక్త కశ్మీరం నుంచి యాత్రికులు, విద్యార్థుల ఇంటిబాట

కశ్మీర్​లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. దాదాపు 100 కంపెనీల బలగాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మోహరించింది. ప్రస్తుతం అదనపు బలగాలను మోహరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

పలు అనుమానాలు...

జమ్ముకశ్మీరుకు ఉన్న ప్రత్యేక అధికారాలు, 35ఏ, 370 అధికరణాల తొలిగింపు కోసమే కేంద్రం భారీగా బలగాలను మోహరిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రత్యేక హోదాను తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని రాష్ట్ర నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వార్తలను కేంద్రం ఖండిస్తోంది. భద్రతా కారణాల వల్లే బలగాల మోహరింపని చెబుతోంది.

యాత్ర రద్దుతో ఆందోళన...

అమర్​నాథ్​ యాత్ర రద్దుతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకస్మికంగా యాత్ర రద్దు చేయడంపై ఆగ్రహిస్తున్నారు. యాత్రకు అవకాశం ఇవ్వాలని సర్కారును కోరుతున్నారు.

"మేము 10 మంది హైదరాబాద్​ నుంచి వచ్చాం. అమరనాథుడి యాత్ర రద్దు చేశారు. దూరం నుంచి వచ్చాం.. చాలా ఖర్చు అయింది. ఇప్పుడు తిరిగి వెళ్లిపోతున్నాం. దర్శనం మాత్రం కాలేదు. మొదటిసారి యాత్రకు వచ్చాను. రావడానికి, పోవడానికి కూడా విమాన ప్రయాణానికి టికెట్​ తీసుకున్నాను. ఈ నెల 10వ తేదీన తిరిగి వెళ్లేందుకు టికెట్​ తీసుకున్నాను. ఇప్పుడు 10వ తేదీ వరకు ఇక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. చాలా గందరగోళంలో ఉన్నాం."
- అమర్​నాథ్​ యాత్రికుడు

మరో యాత్ర రద్దు...

భద్రతా కారణాల దృష్ట్యా జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్​వర్‌ జిల్లాలో జరుగుతున్న మచైల్‌ మాత యాత్రను అధికారులు రద్దు చేశారు. యాత్రను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కిష్ట్​వర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆంగ్రెజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. కిష్ట్‌వర్‌లోని మచైల్‌ గ్రామంలో ఉన్న దుర్గామాత మందిరాన్ని దర్శించుకోవడానికి ఈ యాత్ర చేపడుతుంటారు. జులై 25న మొదలైన యాత్ర సెప్టెంబర్‌ 5న ముగియాల్సి ఉంది.

విద్యార్థులు.... పర్యటకులు....

శ్రీనగర్​ ఎన్​ఐటీకి నిరవధిక సెలవులుప్రకటించింది యాజమాన్యం. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని స్పష్టంచేసింది. ఫలితంగా... ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు పయనమయ్యారు.

కశ్మీర్​ సోయగాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యటకులదీ అదే పరిస్థితి. ఉద్రిక్తతల నడుమ... విహార యాత్రను అర్ధంతరంగా రద్దు చేసుకుని తిరిగి వెళ్తున్నారు.

Last Updated : Aug 3, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details