తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్ యాత్రలో పాటించాల్సిన నియమాలు ఇవే.. - Kartarpur pilgrims can carry maximum Rs 11,000, one 7-kg baggage

కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి భారత్​-పాక్​ల మధ్య ఒప్పందం కుదిరింది. గురుద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యే యాత్రికులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.

కర్తార్​పూర్ యాత్రలో పాటించాల్సిన నియమాలు ఇవే..

By

Published : Oct 25, 2019, 5:33 AM IST

పాకిస్థాన్​లోని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారా సాహిబ్​ను కలిపే కర్తార్‌పుర్ కారిడార్​కు సంబంధించి భారత్​-పాక్​ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన నియమ నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదో పేర్కొంది.

దర్బార్​ సాహిబ్​ దర్శనానికి రోజుకు 5 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు. పండుగ వేళల్లో, ఇతర సమయాల్లో అవసరాన్ని బట్టి యాత్రికులు సంఖ్య పెంచే అవకాశం ఉంది.

చేయవలసినవి...

13 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, 75 సంవత్సరాలపైన వయసు కలిగిన వృద్ధులు.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి.

గురనానక్ దర్శనానికి వచ్చే యాత్రికులు రూ.11 వేలకు మించి వెంట తెచ్చుకోరాదు. 7 కేజీలకు పైగా లగేజీ ఉండకూడదు.

పర్యావరణ హితమైన వస్తువులు, సంచులు మాత్రమే ఉపయోగించాలి.

యాత్రకు ఉదయం వచ్చి దర్శనం పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్లాలి.

దర్బార్​ సాహెబ్​ను దర్శించుకోవాలనుకుంటున్న వారు ఆన్​లైన్​ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఆన్​లైన్​ పోర్టల్​ (prakashpurb550.mha.gov.in)ను నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

ప్రయాణం చేయాల్సిన రోజుకు నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్​ వివరాలు ఎస్​ఎంఎస్, ఈ-మెయిల్​ ద్వారా అందుతాయి. ఎలక్ట్రానిక్​ ట్రావెల్​ ఆథరైజేషన్​ పత్రం తీసుకోవాలి. పాస్​పోర్ట్​తో పాటు దీనిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.

చేయకూడనివి...

దర్బార్​ సాహెబ్​ దర్శనానికి వచ్చే యాత్రికులు సిగరెట్లు, ఆల్కహాలు సేవించరాదు.

దేవాలయానికి సంబంధించిన వస్తువులను ముట్టుకోకూడదు.

కేవలం దర్బార్​ సాహెబ్​ను దర్శించుకోవటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పరిసర ప్రాంతాల చూడటానికి వెళ్లకూడదు.

ఆలయ ప్రాంగణంలో అనుమతి లేకుండా ఎటువంటి చిత్రాలను తీయకూడదు.

సౌకర్యాల ఏర్పాటు..

యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్​ స్థలం, హోటళ్లు, భద్రత, ఇతర భవనాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ భవనాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్​ 8న ప్రారంభించనున్నారు.

నవంబరు 9న ప్రారంభం...

అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌లోని డేరాబాబానానక్‌ గురుద్వారా నుంచి కర్తార్‌పుర్‌ను కలుపుతూ కారిడార్‌ నిర్మించారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నవంబర్​ 9న ఈ కారిడార్‌ను పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:కర్తార్​పుర్: భారత యాత్రికులు 20$ చెల్లించాల్సిందే

ABOUT THE AUTHOR

...view details