తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక కళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి! - కర్ణాటకలో మహిళ సజీవ సమాధి

లోక కళ్యాణం కోసం కర్ణాటకకు చెందిన ఓ సాధ్వి.. సజీవ సమాధి అయ్యారు. దేవత ఆజ్ఞతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. 21 రోజుల పాటు ఆ సమాధిలోనే ఉండనున్నారట.

karnatakas-lady-saint-is-under-the-living-grave-for-the-welfare-of-the-world
లోక కళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి!

By

Published : Feb 9, 2020, 2:23 PM IST

Updated : Feb 29, 2020, 6:08 PM IST

లోక కళ్యాణం కోసం 21 రోజులు సజీవ సమాధి!

మనం బాగుండాలి.. మన వారందరూ బాంగుడాలి అనుకుంటాం అందరం. ప్రార్థనలు, పూజలు కూడా చేస్తాం. కానీ కర్ణాటకలోని ఓ మహిళ మాత్రం... లోక కళ్యాణం కోసం సజీవ సమాధిలో కూర్చొన్నారు. అది కూడా 21 రోజులు...

సాధ్వి మాతోశ్రీ

దేవత ఆజ్ఞ...

మాతోశ్రీ మహదేవి.. కర్ణాటక ధార్వాడ్​ జిల్లాలోని నుగ్గికేరి గ్రామానికి చెందిన సాధ్వి. ఓ రోజు ఆమె కలలో ఓ దేవత ప్రత్యక్షమై... ప్రపంచ హితం కోసం 21 రోజుల పాటు సజీవ సమాధిగా మారాలని ఆజ్ఞాపించింది. నిమిషం ఆలస్యం చేయని సాధ్వి మాతోశ్రీ... వెంటనే స్థానిక ఆదిశక్తి ఎల్లమ్మ ఆలమ్మ ఆలయ నిర్వాహకుల నుంచి అనుమతి పొందారు.

"ఇది చాలా శక్తిమంతమైన దేవత. ఇక్కడున్న సాధ్విమాత గురించి పత్రికలో, ప్రకటనలో చూసి తెలుసుకున్నా. లోక కల్యాణం కోసం, కన్నడ రాష్ట్రంలో సమస్యలు తీరాలని ఆమె కలలో చెప్పిన ప్రకారం సజీవ సమాధిలో ఉన్నారని పత్రికలో రాశారు. అందుకే చూడటానికి వచ్చా."
- ప్రసాద్​ దేశపాండ్యన్​, భక్తుడు

4 అడుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో సమాధి నిర్మించారు. పూజకు కావాల్సిన సరుకులు అన్నీ ముందుగానే అందించారు. ఊపిరి పీల్చుకోవడానికి సమాధి కింది భాగంలో ఓ పైపును ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:- ఇక్కడ లిక్కర్​ కంటే చదరంగానికే కిక్కు ఎక్కువ​.!

Last Updated : Feb 29, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details