ఆధార్ కార్డు మాదిరిగానే రాష్ట్రంలోని రైతులకు 'స్వాభిమాని ఫార్మర్' అనే విశిష్ట గుర్తింపు కార్డు ఇవ్వనుంది కర్ణాటక ప్రభుత్వం. రుణాలు, ప్రభుత్వ పథకాల విషయంలో రైతులకు త్వరితగతిన లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ శనివారం.. కొప్పాల్ జిల్లా రైతులకు తొలిసారిగా ఈ కార్డులు అందించనున్నారు.
'స్వాభిమాని ఫార్మర్' కార్డు అంటే?
రైతుల వివరాలను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీనికి 'ఫ్రూట్స్' అనే పేరు పెట్టింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో వివరాలు నమోదు చేసుకున్న ప్రతీ రైతుకు ఆధార్ మాదిరిగా ఓ ప్రత్యేకమైన నంబర్ కలిగిన గుర్తింపు కార్డు ఇవ్వనుంది. 'స్వాభిమాని ఫార్మర్' ద్వారా ఈ నంబర్ లభిస్తుంది.