తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్​ వేటు - స్వతంత్ర

కర్ణాటక శాసనసభ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు.

ముగ్గురు ఎమ్మెల్యేలపై కర్టాటక స్పీకర్​ వేటు

By

Published : Jul 25, 2019, 9:25 PM IST

Updated : Jul 25, 2019, 10:21 PM IST

విశ్వాస పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలపై స్పీకర్​ రమేశ్​ కుమార్​ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది రాజీనామాలు సమర్పించగా వారిలో ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. 2023 వరకు పోటీకి అనర్హులని తెలిపారు.

స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వెల్లడించారు.

అయితే స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్​ శంకర్​ రాజీనామా చేయకముందు.. తనను కాంగ్రెస్​ సభ్యుడిగా గుర్తించాలంటూ గతంలో స్పీకర్​కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్​ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్​ వేటు వేశారు.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్‌ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Last Updated : Jul 25, 2019, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details