తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: జలుబు, జ్వరమా? అయితే సెలవు!

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. జలుబు, జ్వరంతో బాధపడే విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాల్ని ఆదేశించింది.

karnataka-school-students-with-cold-fever-to-be-given-leave says state govt
కరోనా ఎఫెక్ట్​: జలుబు, జ్వరమా? అయితే సెలవు!

By

Published : Mar 3, 2020, 8:57 PM IST

కరోనా ప్రభావం విద్యా సంస్థలపైనా పడింది. విద్యార్థులకు వైరస్ సోకకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులుంటే విద్యార్థులు, సిబ్బందికి సెలవులివ్వాలని ఆదేశించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.

"విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా పాఠశాల సిబ్బందికి అంటువ్యాధులు ఉన్నట్లైతే వారికి సెలవు ఇచ్చేయాలి. వైద్యులు వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధరించేవరకు వారిని బడికి అనుమతించొద్దు. ఒకవేళ హాస్టల్ విద్యార్థులు అయితే.. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి."

-ప్రభుత్వ ఉత్తర్వులు

ఆ భయంతోనే...

హైదరాబాద్​లో కరోనా సోకినట్లు నిర్ధరణ అయిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్ దుబాయ్​ నుంచి ముందుగా బెంగళూరు వెళ్లారు. అక్కడ అనేక మందిని కలిశారు. ఫలితంగా కర్ణాటకలో కరోనా భయం మరింత ఎక్కువైంది.

"తెలంగాణలో ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​కు కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. అతడు జనవరిలో హాంగ్​కాంగ్​ నుంచి వచ్చిన కొంతమందిని దుబాయ్​లో కలిశాడు. తిరిగి ఫిబ్రవరి 20న బెంగళూరుకు చేరుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్​కు బయల్దేరాడు. ఇక్కడ అతడిని కలిసిన 25 మందికి రక్త పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించాం.'

-సుధాకర్​, ఆరోగ్య శాఖ అధికారి

ఇదీ చదవండి:మంత్రి కుమార్తె వివాహం ఖర్చు అన్ని వందల కోట్లా?

ABOUT THE AUTHOR

...view details