తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో కొత్తగా 8,477 మందికి కరోనా - కరోనా రికవరీలు

దేశంలో కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.11 లక్షల కేసులు నమోదయ్యాయి. వారిలో లక్షా 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 63.84 లక్షల మంది కరోనాను జయించగా.. 8.14 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అటు కర్ణాటకలో మరో 8వేలకుపైగా, కేరళలో 7వేలకుపైగా వైరస్​ కేసులు వెలుగుచూశాయి.

Karnataka reports 8,477 new Covid-19 cases and 85 deaths in last 24 hours
కరోనా పంజా- కన్నడనాట మరో 8వేల మందికిపైగా వైరస్​

By

Published : Oct 15, 2020, 9:03 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో మరో 8,477 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా కేసుల సంఖ్య 7.43 లక్షలకు చేరింది. మహమ్మారికి మరో 85 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 10,283కు ఎగబాకింది.

  • మహారాష్ట్రలో మరో 10,226 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 15,64,615కు చేరింది. కరోనాతో మరో 337మంది చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 41,196కు పెరిగింది.
  • కేరళలో గురువారం ఒక్కరోజే 7,789 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 3,15,929కి ఎగబాకింది. మరో 23 మరణాలతో.. ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,089కి చేరింది.
  • తమిళనాడులో మరో 4,410 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కేసుల సంఖ్య 6లక్షల 74వేల 802కు పెరిగింది. మొత్తం 10,472 మంది మహమ్మారికి బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 2,728 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 4,04,545కు పెరిగింది. కొవిడ్​తో మరో 36 మంది ప్రాణాలు విడవగా.. మరణాల సంఖ్య 2,728కి పెరిగింది.
  • రాజస్థాన్​లో మరో 2,039 కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1,67,279కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 1,708 మంది కొవిడ్​ వల్ల చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details